Ganja : ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా.. పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు
ఏపీలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి కేటుగాళ్లు గంజాయిని సరిహద్దులు
- By Prasad Published Date - 07:28 AM, Thu - 29 December 22

ఏపీలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి కేటుగాళ్లు గంజాయిని సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద ఆత్కూరు పోలీసులు ఆర్టీసీ బస్సులో గంజాయిని పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులో గంజాయి వస్తుందని సమాచారంతో బస్సును సోదా చేయగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు కేజీల లిక్విడ్ గంజాయిని, 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బెంగళూరు తరలించే తరుణంలో పొట్టిపాడు టోల్గేట్ వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.