CBI Jedi: సీబీఐ మాజీ జేడీ ‘రైతు’ అవతారం
నిత్యం సభలు, సమావేశాలతో బిజీగా ఉండే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రైతుగా మారారు.
- Author : Balu J
Date : 07-02-2022 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
నిత్యం సభలు, సమావేశాలతో బిజీగా ఉండే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రైతుగా మారారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం-రాచపల్లి మధ్య కౌలుకు తీసుకున్న పొలంలో అపరాల సాగు చేపట్టారు. 12 ఎకరాలను సేంద్రియ పద్ధతిలో ఖరీఫ్‌లో నల్లవరి, సాధారణ వరి రకాలను సాగుచేసిన ఆయన రబీ పంటగా పెసర, మినుము వేశారు. వ్యవసాయక్షేత్రానికి వచ్చిన లక్ష్మీనారాయణ తొలుత పూజ అనంతరం ట్రాక్టరుతో పొలాన్ని దున్నారు. సాటి రైతుల మార్గదర్శకంలో పెసర, మినుము విత్తనాలను స్వయంగా చల్లారు. ఆయన ట్రాక్టర్ నడుతున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.