Kothagudem : కొత్తగూడెంలో ఫారెస్టు రేంజర్‌పై దాడి చేసిన గుత్తికోయలు
కొత్తగూడెంలో ఫారెస్టు రేంజర్‌పై గుత్తికోయలు దాడి చేశారు. జిల్లాలోని చండ్రుగొండ మండలం బెందాలపాడులో గ్రామ శివారు...
- Author : Prasad
Date : 22-11-2022 - 4:52 IST
Published By : Hashtagu Telugu Desk
కొత్తగూడెంలో ఫారెస్టు రేంజర్‌పై గుత్తికోయలు దాడి చేశారు. జిల్లాలోని చండ్రుగొండ మండలం బెందాలపాడులో గ్రామ శివారు ఎర్రబోడులో ఈ ఘటన చోటుచేసుకుంది. తలపై తీవ్ర రక్తస్రావమైన రేంజర్ శ్రీనివాస్‌రావును చికిత్స నిమిత్తం చండ్రుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వలస వచ్చిన గుత్తికోయ గిరిజనులు ప్లాంటేషన్‌లో చెట్లను నరికివేయడాన్ని అటవీశాఖాధికారి అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.