Fish Lorry : ఏలూరులో చేపల లారీ బోల్తా.. చేపల కోసం ఎగబడిన జనం
ఏలూరు జిల్లాలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు...
- By Prasad Published Date - 11:54 AM, Fri - 25 November 22

ఏలూరు జిల్లాలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు. ప్రమాదానికి గురైన లారీ డ్రైవర్, క్లీనర్‌ను కూడా అక్కడి ప్రజలు పట్టించుకోకుండా చేపలు తీసుకెళ్లేందుకు జనం పోటీపడ్డారు. వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. లారీ పడిపోవడంతో చేపలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. చేపల లోడుతో లారీ కర్ణాటక నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.