Fish Andhra : అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లు త్వరలో ప్రారంభం
అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మత్స్యశాఖ
- By Prasad Published Date - 06:42 AM, Thu - 5 January 23

అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మత్స్యశాఖ అధికారులను కోరారు. కలెక్టర్ కార్యాలయ పరిసరాల్లోని ‘ఫిష్ ఆంధ్రా’ యూనిట్లను కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు 6 యూనిట్లు గ్రౌండింగ్ కాగా ఈ వారం చివరి నాటికి మరో 14 యూనిట్లు గ్రౌండింగ్ కానున్నాయి. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల వాహనాల యూనిట్ల పంపిణీని వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, మత్స్యశాఖ డీడీ శాంతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి పకీరయ్య, ఫిష్ ఆంధ్రా నిర్వాహకులు పాల్గొన్నారు.