Telangana Polls – Chatbot : తెలంగాణ ఓటర్ల డౌట్స్ తీర్చేందుకు ‘ఛాట్ బాట్’ !
Telangana Polls - Chatbot : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ‘ఛాట్ బాట్’ లను వాడబోతున్నారు. కొత్త తరం ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు ఎన్నికల సంఘం ఈ సరికొత్త టూల్ ను వినియోగించబోతోంది.
- By Pasha Published Date - 02:08 PM, Wed - 6 September 23

Telangana Polls – Chatbot : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ‘ఛాట్ బాట్’ లను వాడబోతున్నారు. కొత్త తరం ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు ఎన్నికల సంఘం ఈ సరికొత్త టూల్ ను వినియోగించబోతోంది. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయడానికి ముందు వచ్చే అనేక సందేహాలకు ఈ ఛాట్ బాట్ సమాధానం ఇస్తుంది. ఇందులో ఓటర్లు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ఇలా ఓటర్లకు వన్ స్టాప్ సొల్యూషన్స్ అందించే హబ్ గా ఎన్నికల సంఘం ఛాట్ బాట్ పనిచేయనుంది. ఇలాంటి ఛాట్ బాట్ ను ఎన్నికల్లో వినియోగిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇంతకుముందు ఇలాంటి టెక్నాలజీని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వాడారు. ఓటర్ల డౌట్స్ ను క్లియర్ చేసేలా అప్పటికప్పుడు ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్పడం దీని ప్రత్యేకత. ఈ ఛాట్ బాట్ కు సంబంధించిన అల్గారిథమ్ ను ఎన్నికల సంఘం టెక్నికల్ టీమ్ స్వయంగా తయారు చేసింది. ఈ పని కోసం బయటి నుంచి ఏ ఇతర టెక్నికల్ ఏజెన్సీ హెల్ప్ ను కూడా తీసుకోలేదు.
Also read : Free WiFi – RTC Buses : ఆ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై .. గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్
ఈ ఛాట్ బాట్ ఎంత నాలెడ్జ్ ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓటర్ ఐడీ దగ్గరి నుంచి మొదలుపెడితే పోలింగ్ బూత్ దాకా ఎలాంటి డౌట్ వచ్చినా.. ఇది చకచకా చెప్పేస్తుంది. మనుషులతో చాట్ చేసేందుకోసం ఛాట్ బాట్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అప్ లోడ్ చేశారు. ఈ ఛాట్ బాట్ లో ఒక మెనూ ఉంటుంది. అందులో ఓటర్లకు వచ్చే సాధారణ డౌట్స్ కు సంబంధించిన ఆప్షన్స్ పొందుపరిచి ఉంటాయి. వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ (Telangana Polls – Chatbot) పొందొచ్చు. దేశంలోని ఏ భాషలోనైనా ఈ ఛాట్ బాట్ తో ఛాట్ చేయొచ్చు. మన ప్రెస్ చేసే బటన్ లోని సమాచారాన్ని ఇది ఫాస్ట్ గా రీడ్ చేసి, ఆన్సర్స్ ఇస్తుంది. ఓటు హక్కును ఎలా నమోదు చేసుకోవాలి ? ఓటర్ ఐడీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి ? పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది ? ఓటర్ స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి ? వంటి ప్రశ్నలకు ఇది ఇట్టే ఆన్సర్ ఇస్తుంది. నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు? వారు సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న వివరాలు ఏమిటి ? అనే చిట్టాను కూడా ఇది వివరించగలదు. ఈ చాట్‌బాట్‌ను త్వరలోనే అధికారికంగా ఆవిష్కరించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇది అందుబాటులోకి వచ్చేస్తుందని అంటున్నారు. ఓటర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొని.. దీనిని ఫ్యూచర్ లో ఇంకా బెటర్ చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది.