AP Fire: పార్వతీపురంలో భారీ అగ్నిప్రమాదం
జిల్లాలోని పాలకొండలో గల బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
- Author : Hashtag U
Date : 24-10-2022 - 11:14 IST
Published By : Hashtagu Telugu Desk
జిల్లాలోని పాలకొండలో గల బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి ధమాకా అమ్మకాలకు తెచ్చిన బ్యాటరీ బైక్‌లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని యజమానులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించారు. ఈ ప్రమాదంలో యాభై లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.