Hyderabad: టోలిచౌకి పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం, 10 కోట్ల నష్టం
- By Balu J Published Date - 10:11 AM, Sat - 16 March 24
Hyderabad: టోలిచౌకిలోని సాలార్జంగ్ కాలనీలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. శనివారం ఉదయం 6:00 గంటలకు మంటలను ఆర్పివేశారు. మంటలను అదుపు చేసేందుకు 12 ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు. మంటలను అదుపు చేసేందుకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు
అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని, సంఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.10 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. అగ్నిమాపక సేవల కార్యకలాపాలను సులభతరం చేసేందుకు ట్రాఫిక్‌ను మళ్లించారు. తడి రోడ్డుపై స్కిడ్ కావడంతో ఇద్దరు వాహనదారులు గాయపడ్డారు.
Telangana | A fire broke out in an Oil Godown. The fire broke out at around 8:30 pm last night. The fire was extinguished by 6:00 am today. 12 fire engines were used to fight the fire. It took around 10 hours to control the fire. There are no casualties: Srinivas Reddy, Hyderabad… https://t.co/nuLyaXqd7e
— ANI (@ANI) March 16, 2024
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.