Udyan Express: బ్రేకింగ్.. బెంగుళూరులో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్ఆర్) రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో (Udyan Express) మంటలు చెలరేగాయి.
- Author : Gopichand
Date : 19-08-2023 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
Udyan Express: బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్ఆర్) రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో (Udyan Express) మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. బెంగుళూరు నగరంలోని క్రాంతివీర సంగోలి రాయన్న (కెఎస్ఆర్) రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి.
Also Read: F-16 Fighters To Ukraine : రష్యాతో అమెరికా కోల్డ్ వార్.. ఉక్రెయిన్ కు F-16 యుద్ధ విమానాలు
ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటల కారణంగా భారీగా పొగ వెలువడింది. మరోవైపు రైలులోని రెండు కోచ్ లలో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. బెంగుళూరు రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ రైలు ముంబై నుండి బెంగళూరు స్టేషన్ మధ్య నడుస్తుంద. KSR రైల్వే స్టేషన్ చివరి స్టాప్. ప్రయాణికులు రైలు దిగిన రెండు గంటల తర్వాత అగ్నిప్రమాదం జరిగిందని సౌత్ వెస్ట్రన్ రైల్వేను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI తెలిపింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది, నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.