Fire Breaks Out: ముంబైలో 5 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
ముంబైలోని జవేరీ బజార్ ప్రాంతంలోని 5 అంతస్తుల భవనంలో గురువారం అర్థరాత్రి మంటలు (Fire Breaks Out) చెలరేగాయి.
- By Gopichand Published Date - 06:44 AM, Fri - 9 June 23
Fire Breaks Out: ముంబైలోని జవేరీ బజార్ ప్రాంతంలోని 5 అంతస్తుల భవనంలో గురువారం అర్థరాత్రి మంటలు (Fire Breaks Out) చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే 12కి పైగా ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Also Read: Uttar Pradesh: మరికొద్ది సేపట్లో పెళ్లి.. ఇంతలో షాక్ ఇచ్చిన వధువు.. చివరికి?
#WATCH | Fire breaks out in a 5-storey building in Mumbai's Jhaveri Bazar area. More than 12 fire tenders present at the spot. All the people trapped in the building have been evacuated safely. More details are awaited. pic.twitter.com/HqgQYoayFG
— ANI (@ANI) June 9, 2023
ముంబైలోని జవేరీ బజార్‌లోని ఐదు అంతస్తుల భవనంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే చాలా మంది సామాన్లు కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
Flamingoes Killed: విమానం ఢీకొనడంతో40 ఫ్లెమింగోలు మృతి
ముంబైలోని ఘాట్కోపర్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న సోమవారం ఎమిరేట్స్‌కు చెందిన విమానం ఢీకొనడంతో దాదాపు 40 ఫ్లెమింగోలు మృత్యువాత పడ్డాయి. అయితే దుబాయ్ నుంచి వస్తున్న ఈకే 508 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.