Daman: డామన్‌లోని వాహనాల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
డామన్‌లోని హథియావాల్ ప్రాంతంలోని వాహనాల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 15 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.
- By Praveen Aluthuru Published Date - 07:29 AM, Mon - 1 May 23

Daman: డామన్‌లోని హథియావాల్ ప్రాంతంలోని వాహనాల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 15 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
డామన్‌లోని హథియావాల్ ప్రాంతంలో వాహనాల తయారీ కంపెనీ రావల్వాసియా యార్న్ డైయింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల గురించి సమాచారం అందుకున్న దాదాపు 15 ఫైర్ ఇంజన్లు, ప్రైవేట్ ట్యాంకర్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ సంస్థలో వాహనాలు తయారవుతాయి. మొత్తం మంటలను ఆర్పేందుకు 2-3 గంటల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా ప్రధానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More: ISIS: ఐసిస్ చీఫ్ హతం: టర్కీ అధ్యక్షుడు