Fire Accident : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది...
- By Prasad Published Date - 10:35 PM, Mon - 12 September 22

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దంతో బైక్ బ్యాటరీలు పేలుతున్నాయి. షోరూమ్‌పైన లాడ్జి ఉంది. లాడ్జిలో పలువురు టూరిస్టులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.