Fire Accident : లాలాపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ లాలాపేట రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక
- By Prasad Published Date - 08:11 AM, Sun - 18 June 23

హైదరాబాద్ లాలాపేట రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌లో మంటలు చెలరేగాయని.. రెక్సిన్, థర్మాకోల్ మరియు కలపతో సహా చాలా మండే పదార్థాలు ఉండటంతో మంటలు బాగా వ్యాపించాయని తెలిపారు.. మధ్యాహ్నం 2 గంటలకు అగ్నిమాపక శాఖకు కాల్ వచ్చిందని.. వెంటనే మౌలా అలీ, మల్కాజిగిరి, ఇతర అగ్నిమాపక కేంద్రాల నుండి వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన అగ్నిమాపక చర్య అర్థరాత్రి వరకు కొనసాగింది. మంటలను ఆర్పేందుకు నాలుగు అగ్నిమాపక యంత్రాలు పని చేశాయి.