Car Fire : హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్ విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....
- By Prasad Published Date - 10:31 AM, Sun - 20 November 22

హైదరాబాద్ విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు డ్రైవర్ సూరజ్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయబోతుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసిన డ్రైవర్ సూరజ్ కారు మంటల్లో చిక్కుకోకముందే దూకేశాడు. మంటలు చెలరేగడంతో పక్కనే ఆగి ఉన్న మరికొన్ని వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.