Hyderabad : టపాసుల షాపులో భారీ అగ్ని ప్రమాదం
Hyderabad : టపాసుల షాప్ కావడం తో ఒకదానికి ఒకటి అంటుకోవడంతో భారీ శబ్దంతో పేలడం మొదలయ్యాయి
- Author : Sudheer
Date : 27-10-2024 - 10:35 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్.. అబిడ్స్ బొగ్గులకుంట (Abids Boggulakunta)లోని మయూర్ పాన్ షాప్‌కు సమీపంలో ఓ బాణాసంచా దుకాణం(Diwali Crackers Shop)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. టపాసుల షాప్ కావడం తో ఒకదానికి ఒకటి అంటుకోవడంతో భారీ శబ్దంతో పేలడం మొదలయ్యాయి. చుట్టుపక్కల అన్ని వైపులకూ నిప్పు రవ్వలు వెళ్లడంతో.. మంటలు పెరిగాయి.
క్రేకర్స్ అంటుకోవడంతో ఆ మంటలు పక్కన ఉన్న ఒక హోటల్‌కి వ్యాపించాయి. ప్రస్తుతం 4 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే.. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ మనుషులెవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు. ఒక 16 ఏళ్ల యువతికి గాయాలయ్యాయని అంటున్నారు. షాప్ ముందు పార్క్ చేసిన పది వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయని తెలుస్తుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
Fire ACCIDENT in abids few got injured pic.twitter.com/Zu92iVEh1e
— ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) October 27, 2024
Read Also : Janwada Farm House Party : జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేటీఆర్