lm Kaushik : చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఎల్ఎం కౌశిక్ హఠాన్మరణం..!!
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ lm కౌశిక్ హఠాన్మరణం చెందారు. 36 ఏళ్ల కౌశిక నిన్న సాయంత్రం గుండెపోటులో ఆసుపత్రిలో చేరారు.
- By hashtagu Published Date - 11:53 AM, Tue - 16 August 22
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ lm కౌశిక్ హఠాన్మరణం చెందారు. 36 ఏళ్ల కౌశిక నిన్న సాయంత్రం గుండెపోటులో ఆసుపత్రిలో చేరారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. తమిళనాట కౌశిక్ కు ఎంతో మంచి పేరుంది. సినిమాల విశేషాలు, కలెక్షన్లు తదితర అంశాలపై ఆయన ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఎంతో సమాచారాన్ని అందిస్తుండేవారు. ట్విట్టర్ లో కౌశిక్ కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.
సెలబ్రిటీలను ఆయన చేసే ఇంటర్వ్యూలు కూడా సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకునేవి. మరణించే ఆరుగంటల ముందు ఆయన సీతారామం సినిమాకు సంబంధించిన ట్వీట్ చేశారు. వరల్డ్ వైడ్ గా రూ. 50కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ సినిమా…ఇది అఫీషియల్ అని తెలిపారు. ఇక కౌశిక్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ధనుష్, కీర్తసురేశ్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Related News
Ram Puri Jagannaath : డబుల్ ఇస్మార్ట్ కచ్చితంగా కొట్టాల్సిందే..!
Ram Puri Jagannaath డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్