MS Dhoni: మాహీ .. నా ఆయుష్యు తీసుకుని ఇంకో వందేళ్లు క్రికెట్ కొనసాగించు
మాహీ నా జీవితాన్ని కూడా తీసుకుని ఇంకో వందేళ్లు క్రికెట్ కొనసాగించు... ధోనీ ఆట చూసేందుకు కాలేజ్ బంక్ కొట్టి వచ్చిన... నువ్వు ఎలా మొదలుపెట్టావో మ్యాటర్ కాదు.. కానీ ధోనీలా ఫినిష్ చేయు.
- By Praveen Aluthuru Published Date - 08:56 PM, Tue - 23 May 23

MS Dhoni: మాహీ నా జీవితాన్ని కూడా తీసుకుని ఇంకో వందేళ్లు క్రికెట్ కొనసాగించు… ధోనీ ఆట చూసేందుకు కాలేజ్ బంక్ కొట్టి వచ్చిన… నువ్వు ఎలా మొదలుపెట్టావో మ్యాటర్ కాదు.. కానీ ధోనీలా ఫినిష్ చేయు.. మాహీని చూసేందుకు 1700 కిలోమీటర్లు జర్నీ చేసొచ్చాను.. ఈ కొటేషన్స్ అన్ని ఈ రోజు మ్యాచ్ లో కనిపించిన చిత్రాలు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోని ఒక అధ్యాయం. ఇంకో వందేళ్ల తరువాత కూడా ధోని పేరు వినిపిస్తుంది.

Ms Dhoni Lady Fan
కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్న మహేంద్రుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు అభిమానులు. ఈ రోజు ఐపీఎల్ 2023 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హోరాహోరీగా జరుగుతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు తమ పనులన్నీ వదులుకుని వచ్చారు. కొన్ని వందల మైళ్ళు దాటి ధోని ఆటను చూసేందుకు వచ్చారు.

Ms Dhoni Fan Boy
ఐపీఎల్ 2023 సీజన్‌ని ‘మహీ స్పెషల్ సీజన్’ అని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సీజన్‌లో 10 జట్లు ఐపీఎల్‌లో పాల్గొన్నప్పటికీ, ఒక క్రికెటర్ ఆటతీరుతో క్రికెటర్లందరినీ వెనుకకు నెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎనలేనిది.

Fan Travelled 1700km For Dhoni
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన స్టేడియంలో ఎక్కడ చూసినా ఎంఎస్ ధోని పేరు వినిపించింది. కోల్‌కతా నుంచి గుజరాత్ వరకు, పంజాబ్ నుంచి బెంగళూరు వరకు ఎక్కడ చూసినా మాహీ పేరు వెలిగిపోయింది. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అనే విషయంపై ధోని క్లారిటీ ఇవ్వనప్పటికీ అభిమానులు ఈ సంవత్సరం అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Dhoni Craze
Read More: GT vs CSK: మ్యాచ్ కు ముందు ధోనీని కలిసిన హార్దిక్.. వైరల్ వీడియో