Viral Video: హాస్పిటల్ లో పేషంట్ ముందు డాన్స్ చేసిన కుటుంబ సభ్యులు.. ఎందుకు తెలుసా?
సాధారణంగా మనం ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏదైనా అవుతుంది ఏమో అని భయపడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా
- By Anshu Published Date - 10:10 AM, Thu - 25 August 22

సాధారణంగా మనం ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏదైనా అవుతుంది ఏమో అని భయపడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా హాస్పిటల్ ఏరియాలో, హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు మరింత భయపడుతూ ఉంటాం. పేషెంట్ భయపడటంతో పాటు కుటుంబ సభ్యులను కూడా భయపెడుతూ ఉంటారు. అటువంటి సమయంలో డాక్టర్లు ధైర్యంగా ఉండమని చెబుతూ ఉంటారు. కుటుంబ సభ్యులకు కూడా పేషెంట్లలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.
వారి భయాన్ని పోగొట్టడానికి టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడటం, వారికి ఇతర విషయాల గురించి చెప్పడం, ఏదంటే నవ్వుతున్న వీడియోలను చూపించడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లో ఒక. హాస్పిటల్ ఒక పేషెంట్ ముందు కుటుంబ సభ్యులు డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Punjabi’s undying spirit! pic.twitter.com/NwWWs9DGJa
— HGS Dhaliwal (@hgsdhaliwalips) August 22, 2022
కాగా ఆ వీడియోలో ఒక పెద్దాయనను నవ్వించడం కోసం ఒక పాప ఒక బాబు తో పాటు ఒక ముసలామె, మరొక మహిళ కలసి డాన్సులు వేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి డాన్స్ చేస్తుండడంతో ఆ వీడియో చూసిన ఆ పేషెంట్ సంతోషంగా నవ్వుకుంటున్నాడు. టర్బన్ ధరించిన ఒక యువకుడు మరొక అమ్మాయి కలసి షారిమన్ 3 పెగ్ పాటకు చిందులు వేశారు. ఆ యువకులతో పాటుగా వారి అమ్మ కూడా డాన్స్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియోలో ఉన్న అవ్వ ఆ తాత చేయి పట్టుకొని మరి బెడ్డు పైన స్టెప్పులు వేయించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై నెటిజన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.