Robbery: ఆలయంలో చోరీకి ప్రయత్నించిన దొంగలు.. సీసీ కెమెరాల కంట పడడంతో?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగతనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దొంగలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ సరికొత్తగా దొంగతనా
- By Anshu Published Date - 05:28 PM, Sun - 2 July 23

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగతనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దొంగలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ సరికొత్తగా దొంగతనాలకు బాధపడుతున్నారు. అంతేకాకుండా ఏకంగా పోలీసులకే సవాళ్లను విసురుతున్నారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు మహిళల మెడలో గోల్డ్ ని దొంగతనం చేయడం ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడం షాపుల్లోకి దొరకబడి దొంగతనాలు చేయడం లాంటివి మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఏకంగా ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది దుర్మార్గులు అమ్మవారికి అలంకరించిన వెండి బంగారు ని కూడా దోచుకెళ్తున్నారు.
తాజాగా కూడా ఒక ఆలయంలో దొంగలు చోరీకి ప్రయత్నించారు. మరి చివరికి ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో ఆలయంలోనే దొంగతనం చేసేందుకు దుండగులు తెగబడ్డారు. ఆరుళ్ల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో చోరీకి యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తాజాగా శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు గునపం లాంటి ఆయుధాలతో ఆలయంలోకి ప్రవేశించి ఆలయద్వారాలను పగలగొట్టడానికి విఫలయత్నం చేశారు.
తలుపులు తెరచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. ఉదయం ఆలయానికి వచ్చిన ఆలయ సిబ్బంది తాళాలు తెరిచారు. దొంగలు చోరీకి యత్నించారని సీసీ కెమెరాలో చూసిన ఆలయ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీలో రికార్డయిన విజవల్స్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా సీసీ కెమెరాలో నమోదైన ప్రకారం దొంగలను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.