Threads Vs Twitter : ట్విట్టర్ కు పోటీగా ఫేస్‌బుక్ “థ్రెడ్స్” యాప్.. జులై 6న రిలీజ్
Threads Vs Twitter : ట్విట్టర్‌కు పోటీగా ఫేస్‌బుక్ యజమాని మెటా తన కొత్త యాప్‌ను గురువారం (జులై 6న) లాంచ్ చేస్తోంది.
- Author : Pasha
Date : 04-07-2023 - 9:06 IST
Published By : Hashtagu Telugu Desk
Threads Vs Twitter : ట్విట్టర్‌కు పోటీగా ఫేస్‌బుక్ యజమాని మెటా తన కొత్త యాప్‌ను గురువారం (జులై 6న) లాంచ్ చేస్తోంది. “థ్రెడ్స్” (Threads) అని పిలువబడే ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్‌లో ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది డౌన్ లోడ్ చేసుకోగానే ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా లింక్ అవుతుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి బయటికొచ్చిన స్క్రీన్ షాట్స్ ప్రకారం.. Threads యాప్ డాష్‌బోర్డ్ చూడటానికి అచ్చం ట్విట్టర్ లాగే(Threads Vs Twitter) ఉంటుంది. ఇది టెక్స్ట్ ఆధారిత చాటింగ్ యాప్ అని ఫేస్ బుక్ చెబుతోంది. Threads యాప్ ను ఉచితంగా వాడుకోవచ్చు. వినియోగదారు ఎన్ని పోస్ట్‌లనైనా చూడొచ్చు. అయితే ఈ లొకేషన్ డేటా, కొనుగోళ్లు, బ్రౌజింగ్ హిస్టరీ వంటివన్నీనిల్వ చేస్తుంది కాబట్టి ఎక్కువ మొబైల్ ఇంటర్నెట్ డేటాను వాడుకుంటుంది.
Also read : Bitcoin Scam Explained : కర్ణాటక ‘బిట్ కాయిన్ స్కామ్’ ఏమిటి ? అసలేం జరిగింది ?
జుకర్ బర్గ్ , ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్
ఫేస్ బుక్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ , ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఇద్దరూ ప్రపంచ కుబేరులు. వీరు పోటీపడి మరీ కొత్త యాప్‌లను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో మెటా ఆధిపత్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ చేద్దామంటూ ఇటీవల ట్వీట్ చేశాడు. దీనికి జూకర్ బర్గ్ స్పందించి లొకేషన్ పంపించు అంటూ ప్రతి సవాల్ విసిరాడు. లాస్ వెగాస్‌లో పోరుకు సిద్ధంగా ఉండాలని దీనికి మస్క్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. దీని గురించి సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇంతకుముందు జుకర్ బర్గ్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడంతో పాటు జియు-జిట్సు టోర్నమెంట్ కూడా గెలుచుకున్నాడు. ఒకవేళ నిజంగా వీరిద్దరి మధ్య కేజ్ ఫైట్ జరిగితే గనక జుకర్ బర్గ్ చేతిలో మస్క్ ఓడిపోవడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికే ఇద్దరు పోటీ పడి మరి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.