West Bengal: బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం క్షిణించింది. 79 ఏళ్ల భట్టాచార్య ఆక్సిజన్ స్థాయి కాస్త పడిపోతున్నట్టు తెలుస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 02:39 PM, Mon - 31 July 23

West Bengal: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం క్షిణించింది. 79 ఏళ్ల భట్టాచార్య ఆక్సిజన్ స్థాయి కాస్త పడిపోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీనియర్ డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో పామ్ అవెన్యూ నివాసం నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని, అయినప్పటికీ ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రాణాపాయం లేదని ప్రకటించారు. భట్టాచార్యకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మరియు టైప్ 2 శ్వాసకోశ వైఫల్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో చాలా కాలంగా సిఓపిడి మరియు ఇతర వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య 2000 నుండి 2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
Also Read: MLC Kavitha: నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి: ఎమ్మెల్సీ కవిత