AIDMK : తమిళనాడులో ఏఐడీఎంకే నేత కారుపై దాడి
తమిళనాడులో ఏఐడీఎంకే నేత కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. టుటికోరిన్ జిల్లా నాగంపట్టి గ్రామంలో
- Author : Prasad
Date : 19-12-2022 - 5:35 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడులో ఏఐడీఎంకే నేత కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. టుటికోరిన్ జిల్లా నాగంపట్టి గ్రామంలో ఏఐడీఎంకే మాజీ మంత్రి విజయభాస్కర్ కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కరూర్ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పదవికి అన్నాడీఎంకే అభ్యర్థి తిరువికాను కూడా దాడి చేసిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని మాజీ మంత్రి విజయభాస్కర్ తెలిపారు. తమ బృందం కరూర్ వైపు వెళుతుండగా, నాలుగు వాహనాల్లో వచ్చిన ముఠా తమను అడ్డగించి, కారు అద్దాలు పగలగొట్టి, తిరు వికను కిడ్నాప్ చేసిందని విజయభాస్కర్ చెప్పారు. ఆరుగురు ఏఐఏడీఎంకే కౌన్సిలర్లను బెదిరించి లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించారని తెలిపారు. తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని..హత్యా చేస్తామని బెదిరించినట్లు విజయభాస్కర్ తెలిపారు. ఈ విషయమై డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చామని, చర్యలు తీసుకోవాలని కోరుతూ కరూర్ ఎస్పీని కలుస్తానని విజయభాస్కర్ తెలిపారు.