CM Revanth Reddy : ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయాలి – సీఎం రేవంత్
CM Revanth Reddy : శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రీజినల్ రింగ్ రోడ్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు
- By Sudheer Published Date - 09:18 PM, Fri - 3 January 25

ఇకపై ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) అధికారులను ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రీజినల్ రింగ్ రోడ్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
AP Govt : ఇక తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు
ఈ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు తప్పకుండా బీటీ రోడ్లు (Beatty Roads) అందుబాటులో ఉండాలని, వీటిని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెడల్పుగా డిజైన్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను విడతల వారీగా విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ముఖ్యంగా, నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌లో మిగిలిన భూసేకరణ పనులను సంక్రాంతి వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.