ENO VS Zandu Bomb : తెలంగాణలో ENO, జండూబామ్ ‘మంట’లు
ENO VS Zandu Bomb : ముఖ్యంగా బిఆర్ఎస్ vs కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్లింది
- By Sudheer Published Date - 10:34 AM, Sun - 26 January 25

తెలంగాణ లో మరోసారి రాజకీయాలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ vs కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్లింది. రీసెంట్ గా రేవంత్ బృందం దావోస్ పర్యటన విజయవంతం కావడం..రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని , గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారిగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రచారం చేయడం పై బిఆర్ఎస్ విమర్శలు , ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.
Republic Day 2025 : జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ప్రాముఖ్యత ఏమిటి..?
ఈ విమర్శలకు అధికార పార్టీ నేతలు కౌంటర్లు మొదలుపెట్టారు. ‘రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO’ అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. దానిపై KCR, KTR ఫొటోలను ముద్రించడం గమనార్హం. కాంగ్రెస్ హోర్డింగ్లు ఏర్పాటుకు బిఆర్ఎస్ సైతం అదే రీతిలో కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ‘గుంపుమేస్త్రీ కంపు నోరు కడగడానికి హార్పిక్ పంపిస్తున్నాం’ అంటూ.. గ్రామసభల్లో ప్రజల దాడుల నుంచి ఉపశమనం పొందండంటూ జండూబామ్, జిందా తిలిస్మాత్లనూ పంపించింది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలాంటి రీ కౌంటర్ ఇస్తుందో చూడాలి.