Viral Video: ఏనుగు తరిమేస్తే.. సఫారీ కారులో టూరిస్ట్స్ పీచే ముడ్.. వీడియో వైరల్!!
- By Hashtag U Published Date - 06:45 AM, Sat - 10 September 22
ఏమైందో ఏమో కానీ.. ఒక ఏనుగు సఫారీ కారు వెంటపడింది.
దీంతో కారులోని టూరిస్ట్‌లందరూ తెగ భయపడిపోయారు.
అయితే సఫారీ కారు డ్రైవర్ తన డ్రైవింగ్ స్కిల్స్‌తో వాహనాన్ని వేగంగా రివర్స్ నడిపి, పర్యాటకులను ఏనుగు బారి నుంచి రక్షించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.ఇప్పటివరకు ఈ వీడియో క్లిప్‌ను 1.2 లక్షల మంది చూశారు.
అయితే ఏనుగుకు ఎందుకు అంత అసహనం, ఆగ్రహం కలిగింది? అనేది అధికారులు విచారించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బదోలా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వామ్మో.. వీడియో చూస్తే వెన్నులో వణుకుపుడుతుందంటూ కామెంట్ లు పెడుతున్నారు.
లిఫ్ట్ లో ఉన్న బాలుడిని కరిచిన కుక్క..
న్యూఢిల్లీలో మరో పెంపుడు కుక్క లిఫ్ట్ లో ఉన్న బాలుడిని కరిచిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 75 లోని అపెక్స్ ఎథీనా సొసైటీలో సంభవించింది. కాగా, ఒక బాలుడు బయటకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కాడు. కానీ అందులో అప్పటికే ఒక వ్యక్తి, తన పెంపుడు శునకం జర్మన్ షిఫార్డ్ తో ఉన్నాడు. కుక్కను తాడుతో కట్టి, దాన్ని కంట్రోల్ చేయడానికి కర్రను కూడా పట్టుకున్నాడు. ఆ తర్వాత.. యువకుడు వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చింది. అతను కుక్కను ముందుకు పోనిచ్చాడు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. కుక్క అమాంతం ఎగిరి బాలుడిపై దాడిచేసింది. అతడిని కోరికింది. వెంటనే దానిన యజమాని గట్టిగా వెనక్కు లాగాడు. కానీ అప్పటికే బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం దీనిపై స్థానికంగా రచ్చ జరుగుతుంది.
I am told this is in Kabini ! Hats off to the driver 🫡 deft handling of the situation with a cool mind is commendable. Source- shared by a friend pic.twitter.com/rfCQbIjK1T
— Supriya Sahu IAS (@supriyasahuias) September 8, 2022
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.