MLC Kavitha: ఎలక్షన్ ఎఫెక్ట్, ఛాయ్ హోటల్ లో సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత జనాల్లోకి దూసుకుపోతున్నారు.
- By Balu J Published Date - 12:35 PM, Sat - 25 November 23

MLC Kavitha: పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత జనాల్లోకి దూసుకుపోతున్నారు. అన్ని వర్గాలను ఆకట్టకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జనాలతో కలిసి చాయ్ తాగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో బిజీ బిజీగా గడుపుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీ షాప్ వద్ద ఆగారు. నిజామాబాద్ లో గల సవేరా హోటల్ లో టీ తాగుతూ ఆమె అక్కడ ఉన్న జనాలతో ముచ్చటించారు. ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీలు దిగడానికి చాలా మంది పోటీ పడ్డారు. అకస్మాత్తుగా కవిత తమ హోటల్ ను సందర్శించడం పట్ల యాజమాని, సిబ్బంది ఉబ్బితబ్బయారు.
కాగా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మెట్రోలో ప్రయాణించారు. హెచ్ ఐ సి సి లో రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సమావేశంలో హైదరాబాద్ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించిన తర్వాత రహేజా మైండ్ స్పేస్ స్టేషన్ నుంచి బేగంపేట్ స్టేషన్ వరకు మెట్రోలో మంత్రి కేటీఆర్ ప్రయాణించారు. ఒక సాధారణ ప్రయాణికుడిగా మంత్రి కేటీఆర్ మెట్రోలో కనిపించడంతో ప్రజలు ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు. మంత్రి కేటీఆర్ తన 20 నిమిషాల ప్రయాణంలో పలువురితో ముచ్చటించారు. ఇంటర్మీడియట్ చదువుతూ వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినితోపాటు, ఇప్పటికే ఎంబిబిఎస్ కోర్స్ చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరు పైన కేటీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.