Election Notification: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!
లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
- By Gopichand Published Date - 09:06 AM, Thu - 18 April 24

Election Notification: లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ (Election Notification) విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 25. మే 13న నాలుగో విడత పోలింగ్ జరగనుంది. నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలు ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96లోక్‌సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
అయితే ఈరోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ ప్రక్రియకు అవకాశం ఉంది. ఇందుకు తగిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు చేశారు. నామినేషన్ తర్వాత ఏప్రిల్ 26న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ నాయకులు తమ నామినేషన్ విత్ డ్రా చేసుకోవటానికి ఏప్రిల్ 29 చివరి తేదీ అని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అనంతరం మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
Also Read: ED – 10 Years : మోడీ హయాంలో ఈడీ దూకుడు.. పదేళ్ల లెక్కలివీ..
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. మే 13న ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజున తెలంగాణలో కూడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మే 13న 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి (సికింద్రాబాద్ కంటోన్మెంట్)కు ఎన్నికలు జరగనున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని ప్రముఖ పార్టీలు ఇప్పటికే ప్రచార జోరును పెంచాయి. అయితే ఎన్నికలకు 48 గంటల ముందు ఎన్నికల జోరుకు ఈసీ అధికారులు బ్రేక్ వేస్తారు.
We’re now on WhatsApp : Click to Join
రేపే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న అంటే రేపు జరుగుతాయి. తొలి విడత ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. ఇందులో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు తమ వాదనలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నాయి. అందరి దృష్టి రేపు జరగనున్న ఓటింగ్ పైనే ఉంది. అన్ని పార్టీల కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. రేపటి ఎన్నికల సన్నాహాలను చిన్నా పెద్ద నాయకుల వరకు అందరూ బేరీజు వేసుకుంటున్నారు. ఓటింగ్‌కు సంబంధించి వ్యూహాలు కూడా రచిస్తున్నారు.