HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >East Godavari Volunteer Violent Behavior

East Godavari : సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని చావబాదిన గ్రామ వాలంటీర్

'సిగరెట్లు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనెవరో తెలుసా?" అంటూ శశిధర్ ను చావబాదాడు.

  • Author : Sudheer Date : 26-08-2023 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
East Godavari Volunteer
East Godavari Volunteer

ఏపీలో గ్రామ వాలంటీర్ల (Volunteer ) దారుణాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఏదొక వివాదంలో వాలంటీర్ పేరు వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పటికే హత్యలు , మానభంగాలు, దోపిడీలు , డబ్బులు కాజేయడాలు చేసి వార్తల్లో నిలువగా..తాజాగా గోదావరి జిల్లాలో ఓ బాలుడు సిగరెట్లు తీసుకురాలేదనే కోపంతో ఆ బాలుడ్ని చావబాది..డాబాపై నుంచి కిందకు తోచేసాడు. దీంతో ఆ బాలుడి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ఏపీలో అధికారం చేపట్టిన జగన్..ప్రజలకు మరింత దగ్గరవ్వాలని ఉద్దేశ్యంతో రాష్ట్రంలో వాలంటీరి వ్యవస్థను తీసుకొచ్చాడు. గ్రామంలో వాలంటీర్లను నియమించి ప్రజల అవసరాలను తీర్చాలని అనుకున్నాడు. కానీ వాలంటీర్లు మాత్రం పలు నేరాలకు పాల్పడుతూ..జగన్ కు చెడ్డ పేరును తీసుకొస్తూ..విమర్శల పాలుచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో దారుణాలు బయటకు రాగా..తాజాగా ఇప్పుడు మరో దారుణ ఘటన బయటకు వచ్చింది.

కోరుకొండ మండలం కణుపూరు గ్రామానికి కల్యాణం సతీష్ (23) (East Godavari Volunteer) గ్రామ వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తల్లోజు శశిధర్ ను..సతీష్ సిగరెట్లు తెచ్చి పెట్టమని కోరాడు. అయితే శశిధర్ తీసుకరానని చెప్పి వెళ్ళిపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వాలంటీర్.. గ్రామంలో బుర్ర కథ కార్యక్రమం జరుగుతుండగా బాలుడు శశిధర తో పాటు మరో బాలుడిని తన బైక్ పై బయటకు తీసుకెళ్లాడు. ఊళ్లో తిప్పుతూ… చివరగా ఊళ్లో సామిల్లు దగ్గర ఉన్న డాబా పైకి తీసు కువెళ్లాడు. అక్కడకు వెళ్లగానే సతీష్ శశిధర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Read Also : AP : పవన్ కళ్యాణ్ ఫై పోటీ చేస్తారా..? పోసాని దిమ్మతిరిగే సమాధానం

‘సిగరెట్లు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనెవరో తెలుసా?” అంటూ శశిధర్ ను చావబాదాడు. కొట్టొద్దంటూ మరో బాలుడు ప్రాధేయ పడగా, ఇద్దరినీ కలిపి కొట్టాడు. ఇద్దరూ తప్పించుకోడానికి కిందికి దిగి వెళ్లిపోబోతుండగా శశిధర్ ను వెనుక నుంచి గట్టిగా తన్నడంతో డాబా పైనుంచి కిందకు పడిపోయాడు. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ సతీష్ బెదిరించాడు. కొంతసేపటికి శశిధర్ ను తానే వాహనంపై కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి దింపాడు.

గుడి మెట్లు ఎక్కుతుండగా కిందపడితే తీసుకువచ్చానని అతడి తల్లిని నమ్మించాడు. తీవ్ర గాయాలైన బాలుడిని తల్లిదండ్రులు మర్నాడు రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. గాయాలు తీవ్రంగా ఉండడంతో తగ్గలేదు. దీంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఎక్స్ రే లు తీసి అక్కడ శస్త్ర చికిత్స నిర్వహించారు. అసలు జరిగిన విషయం వారం తర్వాత తల్లిదండ్రులకు శశిధర్ చెప్పడం తో..బాలుడి తల్లి లక్ష్మి గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలుడికి రెండు కాళ్లు, కుడిచేతికి తీవ్ర గాయాలు అయ్యాయని, ఒక కాలికి, చేతికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపింది. వెంటనే వాలంటీర్ సతీష్ ఫై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసింది. పిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి శనివారం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • East Godavari Volunteer
  • Volunteer Violent Behavior

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

    • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd