Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం
పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 5.8 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 05-08-2023 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
Earthquake: పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 5.8 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. హిందూకుష్ పర్వత శ్రేణిలోని తజికిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల సమీపంలో భూకంప కేంద్రం నమోదైంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ మరియు ఇతర నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి. వివిధ తీవ్రతలతో పాకిస్థాన్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ సమీపంలో 2005లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం వల్ల 74,000 మందికి పైగా మరణించారు.