Earthquake in New Zealand: న్యూజిలాండ్‌లో భూకంపం.. 6.1 తీవ్రత నమోదు!
ఇప్పటికే టర్కీ, సిరియా కంట్రీస్ ను అతలాకుతలం చేయగా, తాజాగా మరో దేశంలో భూకంపం సంభవించింది.
- By Balu J Published Date - 05:21 PM, Mon - 13 February 23

పలు దేశాల్లో భూకంపం (Earthquake) భయాందోళనలు రేపుతోంది. ఇప్పటికే టర్కీ, సిరియా కంట్రీస్ ను అతలాకుతలం చేయగా, తాజాగా మరో దేశంలో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్ (New Zealand) లో సోమవారం ఉదయం భూకంపం వచ్చింది. 09:18:07 GMT సమయంలో న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవులలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ఈ సమాచారాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రాన్ని 29.5218 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 177.9727 డిగ్రీల పశ్చిమ రేఖాంశంలో 374.033 కి.మీ లోతుతో ప్రాథమికంగా నిర్ణయించారు. భూకంపం (Earthquake) కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.