Hyderabad : డెలివరీ బాయ్‌పై కుక్క దాడి.. మూడవ అంతస్తు నుంచి ..?
హైదరాబాద్ దారుణ సంఘటన చోటుచేసుకుంది. డెలివరీ బాయ్‌పై కుక్క దాడి చేసింది.ఈ ఘటన నగరంలోని మణికొండ
- By Prasad Published Date - 09:16 PM, Sun - 21 May 23

హైదరాబాద్ దారుణ సంఘటన చోటుచేసుకుంది. డెలివరీ బాయ్‌పై కుక్క దాడి చేసింది.ఈ ఘటన నగరంలోని మణికొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. అమెజాన్ డెలివరీ బాయ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన డెలివరీ చేయడానికి మణికొండలోని పంచవటి కాలనీకి వెళ్లాడు. అక్కడ అకస్మాత్తుగా,డాబర్‌మ్యాన్ కుక్క అతనిపైకి దూకింది. కుక్కను తప్పించుకునే ప్రయత్నంలో డెలివరీ మ్యాన్ మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ఘటనలో డెలివరీ బాయ్‌కి తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఇంతక ముందు జనవరిలో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్‌పై కూడా కుక్క దాడి చేసింది. అతను తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుండి దూకాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.