HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Do You Want To Study In Agraraj But This Is Overwhelming Good News

America: అగ్రరాజ్యంలో చదువుకోవాలని ఉందా..? అయితే ఇది అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

అమెరికాలో ఎడ్యూకేషన్‌ పాలసీ ఎంత పటిష్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే పై చదువులకు అక్కడకి వెళ్తుంటారు వివిధ దేశాల విద్యార్థులు.

  • Author : Anshu Date : 24-02-2023 - 6:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Study Abroad3
Study Abroad3

America: అమెరికాలో ఎడ్యూకేషన్‌ పాలసీ ఎంత పటిష్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే పై చదువులకు అక్కడకి వెళ్తుంటారు వివిధ దేశాల విద్యార్థులు. టీచింగ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. కోర్సు ప్రారంభానికి కంటే ఒక సంవత్సరం ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ టర్మ్ ప్రారంభమయ్యే ఏడాదికి ముందే వీసా జారీ చేయనున్నామని అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రకటించింది.

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు పలు రకాల ఇబ్బందులు పడుతుంటారు.ఎక్కువగా వీసా విషయంలోనే ప్రాబ్లం ఉంటుంది.
ఇప్పుడు ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్‌లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు ఇప్పుడు వీసా కోసం ఒక సంవత్సరం ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ముందుగానే వీసా పొందిన విద్యార్థులు కూడా వారి ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు యూస్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడరు.

దీని ప్రకారం ‘ఎఫ్‌-1 లేదా ఎం’ స్టూడెంట్ వీసాలు ఇప్పుడు I-20 ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 365 రోజుల ముందుగానే జారీ కానున్నాయి.  ఫలితంగా విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుందని అని బ్యూరో ఒక ట్వీట్‌లో పేర్కొంది. అమెరికా యూనివర్సిటీలో చేరబోయే విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను 120 రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు.

అయితే  ముందుగానే వీసా పొందినా కూడా  ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు అమెరికాలో  ప్రవేశించడానికి అనుమతి ఉండదని తెలిపింది. యుఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు ఈ ఏడాది భారతీయ విద్యార్థుల నుండి రికార్డు స్థాయిలో వీసాలు ఆశిస్తున్నామని ముంబైలోని యుఎస్ కాన్సులేట్ జనరల్‌లోని కాన్సులర్ చీఫ్ జాన్ బల్లార్డ్ తెలిపారు. వీసా అపాయింట్‌మెంట్స్‌‌ బ్యాక్‌లాగ్‌ను తగ్గించేందుకు కూడా కసరత్తు చేస్తోంది. వీసా దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసేలా సంబంధిత సిబ్బందిని పెంచాలని, మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారి కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహించాలని కూడా యోచిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • education
  • study abroad

Related News

LPL Financial opens first GCC outside US in Hyderabad

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

LPL Financial  అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ ‘ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్’ తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 450కి పైగా జ

    Latest News

    • Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

    • వామ్మో చర్చి పాస్టర్‌ ఇంట్లో 2.27 కోట్లు

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో మ్యాచ్ ఫిక్సింగ్‌?!

    • Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

    Trending News

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

      • సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

      • BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

      • అంపైర్ల పొరపాటు.. జరిమానా విధించాలని డిమాండ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd