Bappi Lahiri: బప్పిలహరికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి(69) కన్నుమూసిన విషయం విధితమే.
- By Balu J Published Date - 04:48 PM, Thu - 17 February 22

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి(69) కన్నుమూసిన విషయం విధితమే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబయి లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం బప్పి లహిరి అంత్యక్రియలు ముంబయిలో పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు బప్ప లహిరి తన తండ్రి పార్థివ దేహానికి కడసారి వీడ్కోలు పలుకుతూ కన్నీటి పర్యంతమయ్యారు. బప్పి లహరి మరణంతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.