Covid Effects: తెలంగాణలో వ్యాక్సిన్ తప్పనిసరి!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది.
- Author : Siddartha Kallepelly
Date : 21-04-2022 - 4:11 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగు వారాల్లో పాజిటివిటి రేటులో మార్పు లేదని, చాలా జిల్లాలో ఒకటి రెండు కేసులు మాత్రమే ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చిందా అనే అనుమానాలు వద్దని ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన డీహెచ్ ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు వెంటనే వేసుకోవాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు తెలంగాణలో రావొద్దంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. NIM సిరో సర్వే ఆధారంగా సర్వేలు జరిగాయని, ఫోర్త్ వేవ్ రాబోదని సర్వేలు చెప్తున్నాయని తెలంగాణ డిహెచ్ తెలిపారు. 93శాతం ప్రజల్లో కోవిడ్ యాంటీ బాడీస్ ఉన్నట్లు సిరో సర్వేల్లో వెల్లడైందని, ప్రజలందరూ ధైర్యంగా ఉండండని ఆయన కోరారు.