Nagarkurnool: 20 ఏళ్ళ యువతిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బిజినపల్లి మండలంలో యువతి(20)పై లైంగిక దాడికి పాల్పడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాసయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు తెలిపారు.
- Author : Praveen Aluthuru
Date : 19-04-2024 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బిజినపల్లి మండలంలో యువతి(20)పై లైంగిక దాడికి పాల్పడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాసయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు తెలిపారు.
బిజినపల్లి మండలంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామాజిక ఉపాధ్యాయుడు మాసయ్య మూగ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజులుగా యువతి తీవ్ర అస్వస్థతకు గురికాగా, యువతిని తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది.
యువతీ తల్లిదండ్రులు బిజినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాసయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మాసయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: LSG Beats CSK: చెన్నైకు షాకిచ్చిన లక్నో.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం