Solar Panels: సోలార్ రూఫ్ టాప్ కు డిమాండ్.. సొలార్ ప్యానల్స్ పొందాలంటే ఏం చేయాలి?
- Author : Balu J
Date : 29-03-2024 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
Solar Panels: రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ కు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత… భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోలార్ రూఫ్ టాప్ కు భారీగా రాయితీ కల్పించింది. ఈ ప్రభావం కొత్త వినియోగదారులపై పడింది. గతంతో పోలిస్తే… 30శాతం దరఖాస్తులు ఎక్కువైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డిమాండ్ కు తగ్గట్లు సోలార్ విడిభాగాల సరఫరా లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే బడ్జెట్ సమావేశాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ స్కీమ్‌ను (Rooftop solar scheme) ప్రకటించింది కేంద్రం. దీని ద్వారా కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన కింద ఈ బెనిఫిట్ పొందొచ్చని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానేనే ప్రజలు తమ పైకప్పులపై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.
ఆర్థికంగా వెనుకబడిన వారు PMSY పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకంలో సోలార్ ప్యానల్స్ పొందాలంటే ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ సందర్శించి పూర్తి వివరాలు నమోదు చేయండి. ఆ వెబ్ సైట్ లో కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు.