HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Demand For Renaming Of Vijaywada

Vijayawada: విజయవాడకు “కాకాని వెంక‌ట‌ర‌త్నం” పేరు పెట్టాలి

విజ‌య‌వాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభ‌జిస్తున్న నేప‌థ్యంలో విజ‌య‌వాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్య‌మ నేత కాకాని వెంక‌ట రత్నం పేరు పెట్టాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు డాక్ట‌ర్ త‌రుణ్ కాకాని జిల్లా క‌లెక్ట‌ర్ కు విజ్ఞ‌ప్తి చేశారు.

  • Author : Hashtag U Date : 31-01-2022 - 6:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishna Vijayawada
Krishna Vijayawada

విజ‌య‌వాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభ‌జిస్తున్న నేప‌థ్యంలో విజ‌య‌వాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్య‌మ నేత కాకాని వెంక‌ట రత్నం పేరు పెట్టాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు డాక్ట‌ర్ త‌రుణ్ కాకాని జిల్లా క‌లెక్ట‌ర్ కు విజ్ఞ‌ప్తి చేశారు. విజ‌య‌వాడ‌లో కృష్ణా క‌లెక్ట‌ర్ జె.నివాస్ ను ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో జైఆంధ్ర సేవా స‌మితి, కాకాని వెంక‌ట‌ర‌త్నం ఆశ‌య సాధ‌న స‌మితి ప్ర‌తినిధి బృందం క‌లిసింది.

ఆంధ్ర ఉక్కు మ‌నిషిగా పేరొందిన స్వ‌ర్గీయ కాకాని వెంక‌ట‌రత్నం మూడు సార్లు కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యార‌ని, మంత్రిగా ప‌నిచేసి, జిల్లాలో వ్య‌వ‌సాయం, పాడి ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధికి 1920 నుంచి 1972 వ‌ర‌కు విశేషంగా కృషి చేశార‌ని కాకాని వెంక‌ట‌ర‌త్నం మ‌నుమ‌డు అయిన త‌రుణ్ కాకాని వివ‌రించారు. 1923లో మ‌హాత్మా గాంధీజీని విజ‌య‌వాడ‌కు తీసుకురావ‌డంలో కూడా కాకాని వెంక‌ట‌ర‌త్నం కీల‌క‌పాత్ర వ‌హించార‌ని పేర్కొన్నారు. జై ఆంధ్ర ఉద్య‌మంలో పాల్గొని, ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్రాల హ‌క్కుల సాధ‌న కోసం కాకాని నిల‌బ‌డ్డార‌ని, అజాత శ‌త్రువుగా పేరొందిన కాకాని వెంక‌ట ర‌త్నం పార్టీలకు అతీతంగా పోరాడార‌ని తెలిపారు. ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు స్ఫూర్తిగా విజ‌య‌వాడ జిల్లాకు కాకాని పేరు పెట్టాల‌ని క‌లెక్ట‌ర్ జె.నివాస్ కు త‌రుణ్ కాకాని సూచించారు.

విజ‌య‌వాడ‌లోకి కాకాని స‌ర్కిల్ వ‌ద్ద కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని పున‌రావిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ కు విజ్నప్తి చేశారు. అలాగే, నూజివీడు మండ‌లాన్ని ఏలూరులో కాకుండా, విజ‌య‌వాడ జిల్లాలో క‌ల‌పాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితితోపాటు, జై ఆంధ్ర సేవా స‌మితి ప్ర‌తినిధులు, జైరాజ్ సందెపు, ఆకునూరు సర్పంచి కాకాని విజ‌య్ కుమార్ త‌దిత‌రులు క‌లెక్ట‌రును క‌లిసి విన‌త‌ప‌త్రం స‌మ‌ర్పించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • demand for renaming of districts
  • Kakani Venkata Ratnam
  • vijayawada

Related News

CM Chandrababu Naidu

CM Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షిం

  • Rayalaseema is now 'Royal' Seema... Chandrababu's intriguing tweet!

    CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • 'birla New'

    ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

Latest News

  • Telangana Transport Department: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే RTO సేవలు

  • Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

  • Suvendu Adhikari: నేడే సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

  • Manchu Manoj: విజయ్‌పై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

  • Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd