Intestines Hanging Out : కడుపులోని పేగులు బయటపడి వేలాడాయి.. ఢిల్లీ బాలిక హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్
Intestines Hanging Out : ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో మే 28న సాహిల్ అనే యువకుడు .. మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
- By Pasha Published Date - 04:14 PM, Sun - 4 June 23

Intestines Hanging Out : ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో మే 28న సాహిల్ అనే యువకుడు .. మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ హత్యా ఘటనకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికలో భయానక విషయాలు బయటికొచ్చాయి. బాలిక హత్యకు గురైన తర్వాత ఆమె కడుపులోని పేగులు బయటపడి వేలాడాయని(Intestines Hanging Out) పోస్ట్‌మార్టం నివేదికలో ప్రస్తావించారు. దీన్నిబట్టి సాహిల్ చాలా క్రూరంగా పొడిచాడని తేలింది. కత్తితో పొడిచి ఆగకుండా.. ఆమె తలను బండరాయితో బాదాడని కూడా రిపోర్ట్ లో ఉంది. బాలిక తల ప్రాంతంలో కొన్ని ఎముకలు పగుళ్లు, గాయాలతో ఉండటానికి కారణం.. బండరాయితో జరిగిన దాడేనని పోస్టుమార్టం రిపోర్ట్ తెలిపింది.
Also read : Delhi Girl Murder: ఢిల్లీలో యువతి దారుణ హత్య, 20సార్లు కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు!
బాలికకు భుజం నుంచి తుంటి ప్రాంతం వరకు 16 కత్తిపోట్లను వైద్య నిపుణులు గుర్తించారు. ఈ దాడి వల్ల బాలిక శరీరంలోని అనేక ఎముకలు విరిగాయన్నారు. హత్య జరిగిన స్థలం నుంచి కత్తి, బూట్లను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈమేరకు పోలీసులకు పోస్టుమార్టం నివేదిక అందింది.