Mobile App-Murder Attempt : యాప్ స్లోగా డౌన్ లోడ్ అయిందని.. కొడుకుపై కత్తితో తండ్రి దాడి
Mobile App-Murder Attempt : ఆ వ్యక్తి భార్య దగ్గరికి వెళ్లి.. ఫోన్ లో ఒక పేమెంట్ యాప్ ను డౌన్ లోడ్ చేయమని అడిగాడు.. డౌన్ లోడ్ స్లోగా జరిగింది..దీంతో అతగాడికి భార్యపై కోపం పెరిగి, గొడవకు దిగాడు. ఆ తర్వాత .. ?
- Author : Pasha
Date : 18-06-2023 - 9:49 IST
Published By : Hashtagu Telugu Desk
Mobile App-Murder Attempt : ఆ వ్యక్తి భార్య దగ్గరికి వెళ్లి.. ఫోన్ లో ఒక పేమెంట్ యాప్ ను డౌన్ లోడ్ చేయమని అడిగాడు..
ఓకే అని చెప్పిన భార్య.. యాప్ ను డౌన్ లోడ్ చేయడం మొదలు పెట్టింది.
అయితే డౌన్ లోడ్ స్లోగా జరిగింది..
దీంతో అతగాడికి భార్యపై కోపం పెరిగి, గొడవకు దిగాడు. ఆ తర్వాత .. ?
64 ఏళ్ల అశోక్ సింగ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తన భార్య, కొడుకు ఆదిత్య సింగ్ (23)తో కలిసి ఢిల్లీ మధు విహార్‌లోని IP ఎక్స్‌టెన్షన్‌లో ఉంటున్నారు. అశోక్ సింగ్ ఇటీవల గురుగ్రామ్‌లో ఒక ఫ్లాట్ కొన్నారు. దానికి సంబంధించిన కొంత చెల్లింపు కోసం ఒక యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేయమని తన భార్య మంజు సింగ్‌ను కోరాడు. ఆమె యాప్ డౌన్‌లోడ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఎంతకూ యాప్ డౌన్ లోడ్ కాకపోవడంతో అశోక్ ఆగ్రహంతో ఊగిపోయి భార్యతో గొడవ పడ్డాడు. వాళ్ళు గొడవపడటం చూసి కొడుకు ఆదిత్య జోక్యం చేసుకున్నాడు.
Also read : Smart phones: మొబైల్ యాప్స్ పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా..? మీ ప్రైవసీకి ప్రమాదం..!!
ఈక్రమంలో అశోక్ సహనం కోల్పోయి.. వంటగదిలోని కత్తి తీసుకొచ్చి(Mobile App-Murder Attempt) కొడుకు ఆదిత్య ఛాతీపై పొడిచాడు. పక్కటెముకల పైన రెండు గాయాలు అయ్యాయి. దీంతో ఆదిత్యను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. అశోక్‌పై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదిత్య గురుగ్రామ్‌లో కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు.