Lizard In Coke: కోక్ లో బల్లి.. అక్కడి మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ సీల్!!
అది మెక్ డొనాల్డ్ రెస్టారెంట్. ఇద్దరు మిత్రులు కూర్చొని తాపీగా కోక్ కూల్ డ్రింక్ తాగుతున్నారు. అకస్మాత్తుగా ఒకరి కోక్ లో చనిపోయిన బల్లి కనిపించింది.
- By Hashtag U Published Date - 10:43 PM, Tue - 24 May 22

అది మెక్ డొనాల్డ్ రెస్టారెంట్. ఇద్దరు మిత్రులు కూర్చొని తాపీగా కోక్ కూల్ డ్రింక్ తాగుతున్నారు. అకస్మాత్తుగా ఒకరి కోక్ లో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో అతడు ఆగ్రహానికి గురై రెస్టారెంట్ సిబ్బంది ని నిలదీశాడు. ఏంటదీ ? అని ప్రశ్నించాడు. వారు సమాధానం చెప్పకపోగా, కోక్ డబ్బులను రీఫండ్ చేస్తానని నిర్లక్ష్యంగా బదులిచ్చారు.
దీంతో ఆగ్రహానికి గురైన బాధిత వ్యక్తి.. చనిపోయిన బల్లి పడి ఉన్న కూల్ డ్రింక్ గ్లాస్ వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. తన ట్వీట్ కు స్థానిక పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ట్యాగ్ చేశాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్ అయింది. దీంతో పోలీసులు, సంబంధిత అధికారులు రంగంలోకి దూకి ఆ మెక్ డొనాల్డ్ ఔట్ లెట్ ను సీల్ చేశారు. బల్లి పడిన కోక్ కూల్ డ్రింక్ శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు.
@normmacdonald @rory_macdonald @Amy__Macdonald @MacDoesIt @LizMacDonaldFOX @HelenJMacdonald @HelenJMacdonald @frankiemacd @Euan_MacDonald @tv9gujarati @sandeshnews @anjanaomkashyap @htTweets @TimesNow @timesofindia @timesofindia pic.twitter.com/Zb54cPp5bD
— Bhargav joshi (@Bhargav21001250) May 23, 2022