Rs 2.5 cr scholarship: అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదివేందుకు రూ.2.5 కోట్ల స్కాలర్షిప్ సాధించిన దళిత యువకుడు.?
ఆ యువకుడి పేరు ప్రేమ్ కుమార్. వయసు 17 ఏళ్లు. పాట్నాకీ చెందిన ఆ యువకుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్
- By Anshu Published Date - 11:30 PM, Mon - 11 July 22

ఆ యువకుడి పేరు ప్రేమ్ కుమార్. వయసు 17 ఏళ్లు. పాట్నాకీ చెందిన ఆ యువకుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదవడానికి వీలుగా రూ.2.5 కోట్ల స్కాలర్షిప్ ను పొందాడు. పాట్నాలో పులర్విరిషరీప్ లోని గోన్పుర గ్రామానికి చెందిన ఒక కూలికొడుకు. అతని కుటుంబంలో ఎవరూ కూడా కాలేజీకి చదువుకున్న వ్యక్తులు లేరు. అంతేకాకుండా ఇలాంటి స్కాలర్షిప్ పొందిన తొలి మహా దళిత విద్యార్థి కూడా ప్రేమ్ అని చెప్పవచ్చు. ప్రేమ్ కుమార్ ప్రస్తుతం శోషిత్ సమాధాన్ కేంద్రంలో 12 తరగతి చదువుతున్నాడు.
అయితే వచ్చే సంవత్సరం అమెరికా పెన్సిలేనియా కీ వెళ్తాడు. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో బ్యాచ్ డిగ్రీ పొందనున్నాడు. ఇందుకోసం అక్కడి లఫాయెట్టే కాలేజీలో చదవబోతున్నాడు ప్రేమ కుమార్. అయితే ప్రేమ్ ఘనత సాధించిన ఆ కాలేజీ 1926లో స్థాపించింది. అమెరికాలో అదొక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ. అయితే ఆ కాలేజీని స్వయంగా ఆ కాలేజీయే స్వయంగా ప్రేమ్ ను ఎంపిక చేసిందట. ప్రేమ్ తో పాటుగా ప్రతిష్టాత్మక డయ్యర్ ఫెలోషిప్ కీ మరొక ఐదుగురిని కూడా ఎంపిక చేసిందట.
17 ఏళ్ల ప్రేమ్ కుమార్ కీ తగిన గుర్తింపు లేని వర్గాల పట్ల మీరు చూపించే మీ నిబద్ధత, పట్టుదల చూసి మేము ప్రయోజన పొందాము శుభాకాంక్షలు అంటూ ఆమోద పత్రాన్ని రాసి పంపారు కాలేజీ అడ్మిషన్ డీన్ మాథ్యూ ఎస్ హైడ్. అయితే ప్రేమ తాను పొందిన స్కాలర్షిప్ ని తన చదువుకి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ఖర్చులు అన్నింటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. ట్యూషన్ ఫీజు, వసతి గృహం,రవాణా ఖర్చులు,హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా ప్రతి ఒక్కటీకి కూడా ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చట. అయితే స్కాలర్షిప్ వచ్చిన సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు ఎప్పుడు స్కూలుకు వెళ్లలేదు.. ఇది నమ్మశక్యంగా కానీ విధంగా ఉంది. ది డిక్స్ టెరిటీ గ్లోబల్ ఆర్గనైజేషన్ బీహార్ లో మహా దళిత పిల్లల కోసం ఎంతో గొప్పగా పనిచేస్తుంది వారి కృషి వల్ల నేను దీని పొందగలిగాను.. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు ప్రేమ్ కుమార్.