Biggest Ever Seize : బూట్లలో రూ.10 కోట్లు.. సీజ్ చేసిన అధికారులు
Biggest Ever Seize : ఆ ముగ్గురు ఎయిర్ పోర్ట్ కు తీసుకొచ్చిన మూడు లగేజీ బ్యాగ్స్ ను ఓపెన్ చేసి చూసి అధికారులు షాక్ అయ్యారు..
- By Pasha Published Date - 09:40 AM, Sat - 22 July 23

Biggest Ever Seize : ఆ ముగ్గురు ఎయిర్ పోర్ట్ కు తీసుకొచ్చిన మూడు లగేజీ బ్యాగ్స్ ను ఓపెన్ చేసి చూసిన అధికారులు షాక్ కు అయ్యారు..
ఆ బ్యాగ్స్ లోని బూట్లను తీసుకొని చెక్ చేసిన ఆఫీసర్లు ఒక విషయాన్ని గుర్తించారు.
వాటిలో పెద్దఎత్తున ఫారిన్ కరెన్సీ కట్టలు ఉన్నట్టు వెల్లడైంది..
బూట్ల నుంచి బయటికి తీసిన ఫారిన్ కరెన్సీ విలువ రూ. 10.6 కోట్లు ఉంటుందని తేలింది.
Also read : Road Accident : కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు దహనం
ఈ ఫారిన్ కరెన్సీని అక్రమంగా టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు తీసుకెళ్తూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో దొరికిపోయిన ముగ్గురు స్మగ్లర్లలో ఒక బాలుడు కూడా ఉండటం గమనార్హం. ఆ ముగ్గురు కూడా తజకిస్థాన్ జాతీయులే. విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ పురోగతిలో ఉందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. భారతదేశంలోని ఏ విమానాశ్రయంలోనైనా ఇంత భారీగా విదేశీ కరెన్సీని పట్టుకోవడం ఇదే తొలిసారి(Biggest Ever Seize) అని తెలిపారు.
Also read : Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనం