Curfew In Nuh : ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత.. హర్యానాలోని నూహ్ లో కర్ఫ్యూ
Curfew In Nuh : రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణలు చెలరేగిన హర్యానాలోని నూహ్ పట్టణంలో ఇవాళ కర్ఫ్యూ విధించారు.
- Author : Pasha
Date : 01-08-2023 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
Curfew In Nuh : రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణలు చెలరేగిన హర్యానాలోని నూహ్ పట్టణంలో ఇవాళ కర్ఫ్యూ విధించారు.
వీహెచ్ పీ శోభాయాత్రపై కొందరి రాళ్ళ దాడితో మొదలైన ఈ అల్లర్లతో నూహ్ టౌన్ భగ్గుమంది.
సోమవారం రాత్రి నాటికి ఈ గొడవల్లో ముగ్గురు చనిపోగా, పలువురు గాయాలపాలయ్యారు.
కార్లు, ఇతర వాహనాలకు అల్లరి మూకలు నిప్పటించారు.
Also read : Sorry Not Found : చైనా విదేశాంగ మంత్రి మిస్సింగ్ కేసులో మరో మలుపు
ఈ ఉద్రిక్తతల నడుమ గురుగ్రామ్, నూహ్ లలో 144 సెక్షన్ ను(Curfew In Nuh) పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ హింసాకాండ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలను మంగళవారం మూసివేశారు. వీహెచ్ పీ శోభాయాత్రలో మోనూ మానేసర్ అనే వివాదాస్పద గో సంరక్షకుడు పాల్గొనడం వల్లే మరో వర్గానికి చెందిన వారు ఆగ్రహంతో రాళ్లదాడికి తెగబడ్డారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు ఇప్పటికే నూహ్, గురుగ్రామ్‌లలో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో నూహ్‌లో 1,000 మంది పోలీసులను మోహరించారు.
Also read : Love Marriages: ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి: సీఎం భూపేంద్ర పటేల్