Shreyas Iyer Car:క్రికెటర్ శ్రేయస్ అయ్యర్…కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
- By hashtagu Published Date - 09:30 AM, Sun - 5 June 22
పారిశ్రామిక వేత్తలు, సినీతారలే కాదు…క్రికెటర్లు కూడా లగ్జరీ కార్ల కలెక్షన్ లో ముందుంటున్నారు. ఈమధ్యే IPLపుణ్యమాని యువక్రికెటర్లు కోటీశ్వర్లుగా మారిపోతున్నారు. అంతేకాదు లగ్జరీ కార్లకు ఓనర్లు అవుతున్నారు. తాజాగా టీమిండియాకు చెందిన క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కార్ల కలెక్షన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. IPLలో కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యార్ ఈ మధ్యే మెర్సిడెస్ AMGG63 3 మ్యాటిక్ SUVని కొనుగోలు చేశాడు.
ఈ కారు 4.0లీటర్ V8బి టర్బో ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 430KWశక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4.5 సెకన్లలో గంటకు 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు షోరూం ధర రూ. 2.45కోట్లు. ఇదేకాదు అయ్యార్ కు లంబోర్ఝిని హురాకాన్ కారు కూడా ఉంది. ఇక శ్రేయస్ కు లగ్జరీ కార్లంటే పిచ్చి. ఆడి ఎస్5 , లంబోర్ఝిని హురాకాన్ వంటి లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. అతని వద్ద రెడ్ కలర్ లంబోర్ఝిని హురాకాన్ ఉంది. ఈ కారు V10ఇంజన్ ఉంది. 5.2లీటర్ సహజంగా V10 8,000rpm వద్ద 631bhp, 6,500rpm వద్ద 601Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంది. ఇది నాలుగు చక్రాలకు శక్తిని ప్రసారం చేస్తుండటంతోపాటు… హురాకాన్ EVO కేవలం 2.9 సెకన్లలో గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 325కి.మీ కంటే ఎక్కువగా ఉంటుంది.
ఇవే కాదు శ్రేయస్‌కి ఆడి ఎస్5 కారు కూడా ఉంది. ఇది ప్రీ-ఫేస్ లిఫ్ట్ వెర్షన్. ఇది 5,400, 6,400rpm మధ్య 349bhp, 1,370 , 4,500rpm మధ్య 500Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేసే 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ V6 ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది కూడా ఫోర్ వీల్ డ్రైవ్ మోడల్. కారు ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
Related News
KKR vs LSG: ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమేనా..? నేడు లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు IPL 2024లో అత్యంత విజయవంతమైన రెండవ జట్టుగా నిలిచింది. 10 మ్యాచుల్లో 7 గెలిచిన ఈ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.