AP Poll : రోజా ఓటమి ఖాయం – CPI నారాయణ
నిధుల మంజూరు విషయంలో వద్దని రోజా చెప్పినట్లు తెలిసిందన్నారు
- Author : Sudheer
Date : 02-05-2024 - 5:53 IST
Published By : Hashtagu Telugu Desk
నగరి లో రోజా (Roja) ఓటమి ఖాయమన్నారు సీపీఐ నారాయణ (CPI Narayana). వైసీపీ లో మొదటగా ఓడిపోయేది రోజానేని చెప్పుకొచ్చారు. రోజా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా..అనేక దందాలకు పాల్పడినట్లు మొదటి నుండి ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి. సొంత పార్టీ నేతల దగ్గరి నుండి కూడా కమిషన్లు అడిగిందని అధిష్టానానికి తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా రోజా ఆగడాలు ఎక్కువయ్యాయి అని , ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వదంటూ పెద్ద ఎత్తున నేతలు ..అధిష్టానానికి లేఖలు సైతం రాసారు. అయినప్పటికీ జగన్ ఆమెకు టికెట్ ఇచ్చి బరిలో దింపారు. తాజాగా ఇదే విషయాన్నీ సీపీఐ నారాయణ ఓ టీవీ డిబేట్ లో చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
నగరిలో రోజా ఓటమి ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసారు. మీ ఊరిలో రోడ్డు వేయించారా అని రిపోర్టర్ ప్రశ్నించగా..రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు సాంక్షన్ చేస్తామని తుడా చైర్మన్ చెప్పారని, అనుకోకుండా సజ్జల, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎయిర్ పోర్టులో కలిశామని.. రోడ్డు విషయమై రోజాను అడిగితే తనకేం సంబధం లేదని చెప్పిందని నారాయణ అన్నారు. నిధుల మంజూరు విషయంలో వద్దని రోజా చెప్పినట్లు తెలిసిందన్నారు. అయితే తాను పోస్ట్ చేసిన ఓ వీడియో చూసి అధికారులు పరువు పోతుందని రోడ్డు వేశారన్నారు. ఈయన మాత్రమే కాదు పలు సర్వేలు సైతం నగరి లో రోజా ఓటమి ఖాయమని చెపుతున్నాయి. చూద్దాం ఏంజరుగుతుందో..!!
Read Also : AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్