Covid-19 Cases: దేశంలో కరోనా ఉగ్రరూపం
- Author : Balu J
Date : 19-01-2022 - 11:54 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 2,82,970 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కంటే 44,889 (18 శాతం మేర)కొత్త కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.13 శాతానికి పెరిగిపోయింది. 24 గంటల వ్యవధిలో 441 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల 79 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు. 4,87,202 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
