Pre Wedding: శ్రుతి మించిన పైత్యం.. ఏకంగా పాములతో ఫ్రీవెడ్డింగ్ ఫోటో షూట్?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కూడా కొత్తగా చేయాలి పాపులర్ అవ్వాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సా
- By Nakshatra Published Date - 06:30 PM, Fri - 2 June 23
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కూడా కొత్తగా చేయాలి పాపులర్ అవ్వాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు తెలియకుండానే ప్రాణాలు మీద కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ల విషయంలో ఇది మరీ దారుణం అని చెప్పవచ్చు. నూతన వధువు వరులు పెళ్లి కంటే ముందుగా ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ని జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాస్త విన్నుత్నంగా ఆలోచిస్తూ బీచ్ ఏరియాలలో, రవి ప్రాంతాలలో, టూరిస్ట్ ప్రదేశాలలో రకరకాల ప్రదేశాలలో ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
కొన్ని కొన్ని సార్లు పైత్యం మితిమీరి తెలియకుండా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కాకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న కేరళలో ఒక పెళ్లయిన నూతన వధువు వరుల జంట ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఒక వెళ్లి ఫోటోలు దిగుతున్నారు. వధువు వరులు ఏనుగు దగ్గర ఫోటోలు దిగిన తర్వాత వరుడు ఒక్కడే ఏనుగు దగ్గరగా వెళ్లి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఏనుగు అతనిపై దాడి చేసి అందరూ చూస్తుండగానే అతన్ని పంచెను ఊడదీసింది.
Pre Wedding Photoshoot ❤️
A Thread: 🧵 pic.twitter.com/8vXpgTRMNK
— vivekk (@oyevivekk) May 27, 2023
పక్కనే కొందరు ఆ ఏనుగుని అదుపు చేయడంతో అతడికి ఏమీ కాలేదు. తాజాగా ఒక జంట కొత్తగా ఆలోచించి పాముతో ఏకంగా ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ నిర్వహించారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో ఒక యువతి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా పాము కనబడుతుంది. ఆ పామును చూసి భయపడుతుంది.
— vivekk (@oyevivekk) May 27, 2023
ఇంతలోనే స్కూటీపై ఇద్దరు యువకులు వస్తారు. అందులో ఒక అతను ఆమెను పాము నుంచి రక్షిస్తాడు. ఆ పామును మళ్ళీ ఆ బాక్స్ లో వదిలిపెడతాడు. ఆ పామును పట్టడం అయిపోయిన తర్వాత ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేయమంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అలా పాము కారణంగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా ఆ పరిచయం ప్రేమగా మారింది అనే కాన్సెప్ట్ తో వీడియోని ఫోటో షూట్ ని ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు జంటపై నెటిజన్స్ మండిపడుతున్నారు.
Related News
Urfi Javed: ఉర్ఫీ సమ్మర్ స్పెషల్ ఔట్ ఫిట్ మామూలుగా లేదుగా.. వేరే లెవెల్ అంటూ!
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఉర్ఫీ జావేద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్రమైన వేషధారణ. చిత్ర విచిత్రమైన వేషధారణతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ ని కూడా ఉంటుంది.