HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Counting Of Votes In Atmakur By Election Today

Bypoll Counting : నేడు ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు.. భారీ బందోబ‌స్తు ఏర్పాటు

  • Author : Prasad Date : 26-06-2022 - 7:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గ‌ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జ‌ర‌గ‌నుంది. ఓట్లు లెక్కింపు ప్రక్రియ కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టడం జరిగిందన్నారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కౌంటింగు సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓట్లు లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి, పార్టీ ఏజెంట్లకు, మీడియా వారికి పాసులు జారీ చేశామ‌ని.. పాసులు ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామ‌న్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశామ‌ని.., 20 రౌండ్స్ లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుతో ఓట్లు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

ప్రతి టేబుల్ కు ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్ ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్ చివర్లో ర్యాన్డంగా ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివి ప్యాట్స్ ను ప్రత్యేకంగా లెక్కించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మీడియా కవరేజ్ నిమిత్తం ప్రత్యేకంగా మీడియా రూమును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ హాల్లోకి వెళ్లుటకు వేరువేరుగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన బందోబస్తు నడుమ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • athmakuru byelections
  • bjp
  • Bypoll Counting
  • mekapati gowtham reddy
  • tdp
  • ysrcp

Related News

Jagan

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని, కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో ఇటువంటి పిల్స్ వేస్తున్నారా అని ఎంపీ గురుమూర్తిని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

    Latest News

    • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

    • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

    • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

    Trending News

      • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

      • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

      • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

      • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

      • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd