Alia-Ranbir: ఏప్రిల్ 14న అలియా, రణబీర్ మ్యారేజ్..!!
బీ టౌన్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్ బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో పెళ్లితో ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట భార్యభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.
- By Hashtag U Published Date - 06:13 AM, Sat - 9 April 22

బీ టౌన్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణ్ బీర్ కపూర్ ఏప్రిల్ రెండో వారంలో పెళ్లితో ఒక్కటవుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట భార్యభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 16న అలియా వివాహం జరగనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథలు ప్రసారమయ్యాయి. కానీ ఆ తేదీన కాకుండా ఏప్రిల్ 14న ఈ జంట వివాహమాడనుందని అలియా మామ రాబిన్ భట్ తెలిపారు. ఏప్రిల్ 13న మెహందీ ఫంక్షన్ జరగనుంది.
అలియా రణ్ బీర్ ల పెళ్లి వేడుకలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు బీ టౌన్ గుసగుసలు నడుస్తున్నాయి. వివాహం తర్వాత ఇరువురి తరపు కుటుంబ సభ్యులు కలిసి డిన్నర్ చేస్తారన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇక అలియా, రణబీర్ మ్యారేజ్ అతిథుల జాబితాలో కరణ్ జోహార్, షారుక్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ, ఆకాన్షా రంజన్, అనుష్క రంజన్, రోహిత్ ధవన్, వరుణ్ ధావన్, తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. హనీమూన్ కోసం అలియా, రణబీర్ దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు. రణ్ బీర్, అలియా దక్షిణాఫ్రికాలో హనీమూన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత…ఈ జంట మళ్లీ ఆఫ్రికాలో సఫారీకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు హాలీవుడ్ లో తొలి చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ షూటింగ్ కోసం యూనైటెడ్ స్టేట్స్ వెళ్లనుంది. ఇక రష్మిక మందన్నతో కలిసి సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్న యానిమల్ షూటింగ్ లో రణబీర్ పాల్గొనున్నాడని సమాచారం.