HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Company In China Threatens To Fire Married Staff For Extramarital Affair

Extramarital Affair: కొత్త నిబంధనను జారీ చేసిన కంపెనీ.. వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం పోవడం ఖాయం?

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భార్యాభర్తలు వివాహిత సంబంధాల మోజులో పడి జీవితాలను చేజేతుల

  • Author : Anshu Date : 18-06-2023 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Extramarital Affair
Extramarital Affair

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భార్యాభర్తలు వివాహిత సంబంధాల మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ వివాహేతర సంబంధాల సంఖ్యను తగ్గించడం కోసం తాజాగా ఒక కంపెనీ వింత ఆదేశాలను జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని ఓ కంపెనీ వింత ఆదేశాలు జారీ చేసింది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులెవరూ వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు అన్న నిబంధనను విధించింది.

అలాగే విడాకులు కూడా ఇవ్వొద్దని తెలిపింది. వీటిని అతిక్రమించిన వారిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని తెలిపింది. ఈ ఆదేశాలను కంపెనీ జూన్‌ 9న జారీ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే, తాజాగా ఈ నిబంధనపై చైనాలోని సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. కంపెనీ అంతర్గత నిర్వహణను మెరుగుపర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కుటుంబానికి విశ్వాసంగా ఉండడం, దంపతుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పే సంస్కృతిని బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటేనే ఉద్యోగుల పనితీరు కూడా బాగుంటుందని భావించే ఈ నిబంధనను రూపొందించినట్లు తెలిపారు. కాగా దీనిపై చైనా సోషల్‌ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై నిబంధనలను రూపొందించడం సరికాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇలాంటి నిబంధనల వల్ల కుటుంబ విలువలు నిలబడతాయనే వాదన కూడా కొంతమంది నుంచి వినిపిస్తోంది. షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న వీఅండ్‌టీ లా సంస్థకు ఓ లాయర్‌ మాత్రం న్యాయపరంగా ఈ నిబంధన సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఓ ఉద్యోగిని తొలగించడానికి అతని పనితీరు ఆధారిత కారణాలు మాత్రమే న్యాయస్థానంలో చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • CHINA COMPANY
  • extramarital affair
  • married staff

Related News

Donald Trump holds call with Xi Jinping

గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు

CHINA vs USA  ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో చైనాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఆ దేశం 2020 జూన్‌లో అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా మంత్రి చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. తాజాగా, ఈ ఆరోపణలపై బీజింగ్ స్పందించి.. అమెరికాకు చురకలు అంటించింది. ముందు అమెరికా తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించాలని కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఎటువంటి పరీక్షలు చేయలేదని, అంతర్జాతీయ అణు ని

  • Rahul Gandhi

    రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Latest News

  • టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

  • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

  • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

  • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

Trending News

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd